దేశవ్యాప్తంగా విశేషాదరణ పొందిన ఆస్కార్ అవార్డు సినిమా 'స్లమ్‌డాగ్ మిలియనీర్'. ఈ చిత్రంలోని ఓ గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహరించే ప్రేమ్‌కుమార్ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్‌కపూర్ నటించారు. ఈ పాత్రలో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే ఈ హోస్ట్ పాత్రలో స్టార్ హీరో షారుక్ ఖాన్ వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి?
అవును మీరు విన్నది నిజమే. అనిల్‌కపూర్ కన్నా ముందు ఈ పాత్రకు షారుక్‌ను సంప్రదించారు ఆ చిత్ర దర్శకుడు డానీ బోయెల్. దీని కోసం ఇద్దరు కలిసి కొంతకాలం కూడా పనిచేశారు. కానీ అనంతరం ఆ పాత్ర చేయనని వెనక్కి తగ్గారు.
అయితే తాజా ఇంటర్వ్యూలో అందుకు గల కారణాన్ని వివరించారు షారుక్. పాత్ర నిడివి తక్కువ ఉండటం, కొంచెం మోసపూరితమైనదిగా అనిపించడం వల్ల తిరస్కరించినట్లు ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.