తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగనకు ఎందుకు సమన్లు ఇవ్వడం లేదు? - Nagma kangana

చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో డ్రగ్స్​కు బానిస అయ్యానంటూ ఇటీవలే కంగనా రనౌత్​ ఓ వీడియోలో వెల్లడించారు. కాగా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు కంగన స్వయంగా చెప్పినా.. ఎన్​సీబీ అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదని కాంగ్రెస్​ నాయకురాలు నగ్మా ప్రశ్నించారు.

Why hasn't NCB summoned Kangana Ranaut who admitted to taking drugs?: Nagma
డ్రగ్స్​ కేసులో కంగనకు ఎందుకు సమన్లు ఇవ్వడం లేదు?

By

Published : Sep 24, 2020, 11:49 AM IST

ఒకప్పుడు తానూ డ్రగ్స్‌కు బానిసయ్యానని బాలీవుడ్‌ నటి కంగన రనౌత్ స్వయంగా చెప్పినప్పటికీ.. ఎన్​సీబీ అధికారులు ఆమెకు సమన్లు ఎందుకు ఇవ్వలేదని నటి, కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న ఎన్​సీబీ అధికారులు ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితోపాటు డ్రగ్స్‌ సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వాట్సాప్‌ సందేశాల ఆధారంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్‌ నటీమణులు దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, రకుల్‌కు ఎన్​సీబీ అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు.

అయితే వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని సదరు నటీమణులకు సమన్లు జారీ చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మా తప్పుబట్టారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఎన్​సీబీ తీరుపై నిప్పులు చెరిగారు.

"వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని కొంతమంది నటీమణులకు సమన్లు జారీ చేసినప్పుడు.. డ్రగ్స్‌ తీసుకున్నానని బహిరంగంగా చెప్పిన కంగన రనౌత్‌కు ఎన్​సీబీ అధికారులు సమన్లు ఎందుకివ్వలేదు?. సెలబ్రిటీల సమాచారాన్ని పత్రికలకు అందజేసి వారిని ప్రజల్లో అపఖ్యాతి పాలుచేయడం ఎన్​సీబీ విధా? ఇది నిజంగా విచారకరమైన విషయం."

- నగ్మా, నటి, కాంగ్రెస్​ నాయకురాలు

భాజపాపై వ్యతిరేకతే కారణం

అనురాగ్‌ కశ్యప్‌, దీపికా పదుకొణె, దియా మీర్జా.. వీళ్లంతా ఒకప్పుడు భాజపాకు వ్యతిరేకంగా గళం విప్పారని.. అందుకే వారిని ఈవిధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ నగ్మా కొన్ని ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్‌ చేశారు. "సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కి న్యాయం జరగాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా మొదట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కంగన రనౌత్.. ఇప్పుడు బాలీవుడ్‌కు వ్యతిరేకంగా తాజా వ్యాఖ్యలు చేశారు. అలాగే సుశాంత్‌ మృతి కేసు విషయంలో ముంబయి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ఇప్పుడు స్వచ్ఛంద పదవీ వివరణ చేసి భాజపా టికెట్‌ తీసుకుని రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటున్నారు" అని నగ్మా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details