తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ డైరీ: ఒక రాత్రి జరిగిన కథ - elizibeth taylor

1966లో సరిగ్గా ఇదే రోజు విడుదలైన 'హు ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా ఊల్ఫ్' 5 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఒక రాత్రి నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన కథే ఈ చిత్రం.

సినీ డైరీ: ఒక రాత్రి జరిగిన కథ

By

Published : Jun 21, 2019, 12:11 PM IST

13 ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయింది. ఓ సినిమాకి సంబంధించి అన్ని విభాగాలకు నామినేషన్‌ పొందినవి కేవలం రెండు చిత్రాలే ఉండగా, వాటిలో ఒకటిగా నిలిచింది. చివరకి 5 ఆస్కార్​లను గెలుచుకుంది. ఇందులో హాలీవుడ్‌ ప్రముఖ నటీనటులు ఎలిజబెత్‌ టేలర్, రిచర్డ్‌ బర్టన్, జార్జి సీగల్, శాండీ డెన్నిస్‌లు నటించారు. ఆ సినిమా ‘హూ ఈజ్‌ ఎఫ్రైడ్‌ ఆఫ్‌ వర్జీనియా ఊల్ఫ్‌?’. 1966లో సరిగ్గా ఇదే రోజున విడుదలైంది.

ఒక రాత్రి జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. ఓ పార్టీకి వెళ్లిన నడివయసు జంట, అక్కడ పరిచయమైన నవ దంపతులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఆపై ఆ నలుగురూ కలిసి తాగుతూ, సరదా ఆట, పాటలతో కాలక్షేపం చేస్తుంటారు. ఆ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడం, నవ దంపతులు వారి మధ్య సర్దుబాటు చేయడానికి ప్రయత్నించడం లాంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ఏది నిజమో, ఏది ఆటో తెలియనంత ఉత్కంఠ కలుగజేస్తుంది. తెల్లారేసరికల్లా కథ పూర్తయిపోతుంది.

హు ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా ఊల్ఫ్ సినిమాలోని ఓ సన్నివేశం

అమెరికన్ రచయిత ఎడ్వర్డ్ అల్బీ రాసిన నాటకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 7.5 మిలియన్‌ డాలర్లతో తీస్తే, 40 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.

ఇది చదవండి: సినీ డైరీ: జపాన్​లో రామానాయుడు ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details