తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దడపుట్టిస్తోన్నవిజయ్ 'విజిల్'​ ట్రైలర్

తమిళ హీరో విజయ్​, నయనతార ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'విజిల్'. ఈ సినిమా తెలుగు ట్రైలర్​ను గురువారం విడుదల చేశారు.​

By

Published : Oct 17, 2019, 7:55 PM IST

విజిల్

కోలీవుడ్ అగ్రనటుడు విజయ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం 'బిగిల్‌'. తెలుగులో 'విజిల్‌' పేరుతో విడుదల కానుంది. నయనతార కథానాయిక. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్​ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. గురువారం తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో ఫుట్‌బాల్‌ కోచ్​గా కనిపించనున్నాడీ నటుడు. నయనతార, విజయ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు కనువిందు చేస్తున్నాయి. యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. విజువల్స్​తో పాటు ఏఆర్​ రెహ్మన్ నేపథ్య సంగీతం అలరిస్తోంది.

బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్​తో గతంలో తెరీ(పోలీసోడు), మెర్సల్‌(అదిరింది) చిత్రాలు తెరకెక్కించాడీ దర్శకుడు.

ఇవీ చూడండి.. భారత సరిహద్దుల్లోని శాటిలైట్ వీడు..!

ABOUT THE AUTHOR

...view details