తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లి గురించి మాట్లాడిన​ ఆలియా భట్

హీరో రణ్​బీర్ కపూర్​తో ఆలియా రిలేషన్​లో ఉందనే వార్తలు ప్రస్తుతం జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో తన పెళ్లి గురించి మాట్లాడిందీ భామ. ఇంతకీ ఆలియా ఏం చెప్పింది?

alia
ఆలియా

By

Published : Dec 22, 2020, 5:12 PM IST

Updated : Dec 22, 2020, 5:31 PM IST

బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​-ఆలియా భట్ పెళ్లి చేసుకోనున్నారంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. సోషల్​ మీడియాలో ఎప్పుడూ దీని గురించే చర్చించుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా.. తన వివాహం విషయమై మాట్లాడింది. ప్రస్తుతం ఆ ఆలోచనే లేదని చెప్పింది.

"నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అని అందరూ ఎందుకు అడుగుతున్నారు? మీకు తెలుసు నా వయసు ఇంకా 25 ఏళ్లే. ఇప్పుడు వివాహం చేసుకోవడమనేది తొందరపాటు పని అవుతుంది"

-ఆలియా భట్​, హీరోయిన్

2018లో సోనమ్‌ కపూర్‌- ఆనంద్‌ ఆహుజా పెళ్లి వేడుకలో రణ్​బీర్-ఆలియా కలిసి కనిపించడం వల్ల వీరి మధ్య ప్రేమ చిగురించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆలియా.. 'గంగూబాయ్'​, 'ఆర్​ఆర్​ఆర్'​, 'బ్రహ్మస్త్ర' సినిమాల్లో నటిస్తుండగా... రణ్​బీర్​ 'బ్రహ్మస్త్ర', 'లవ్​ రంజన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈమధ్యే వీరిద్దరూ గోవాలో జరిగిన ఫుట్​బాల్​ మ్యాచ్​కు హాజరయ్యారు. ఆ ఫొటోలు వైరల్​గానూ మారాయి.​

ఇదీ చూడండి :రణ్​బీర్-అలియా గోవా ఎందుకెళ్లారు?

Last Updated : Dec 22, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details