తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బప్పి లహిరి ఒంటి నిండా బంగారం.. ఎందుకంటే? - Bappi Lahiri death reason

Bappi lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి, కిలోల కొద్ది బంగారం ధరిస్తారు. అయితే ఆయనకు గోల్డ్​ అంటే ఎందుకంత ఇష్టం? మెడలో అన్ని బంగారు చైన్లు ఉండటానికి కారణమేంటి?

Bappi Lahiri
బప్పి లహిరి

By

Published : Feb 16, 2022, 2:56 PM IST

Updated : Feb 16, 2022, 3:25 PM IST

Bappi lahiri gold collection: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరికి భారత చిత్రసీమలో 'డిస్కో కింగ్'​గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈయన పాటలు సినీప్రియులను తెగ ఉర్రూతలూగిస్తాయి. అయితే ఈయన స్టైల్ కూడా వేరే. తన పాటలతోనే కాకుండా విభిన్నమైన ఆహార్యంతోనూ ఆయన అభిమానుల మదిలో నిలిచిపోయారు. ఎప్పుడూ, ఎక్కడ చూసినా ఒంటినిండా బంగారంతో ధగధగ మెరిసేవారు. అందుకే ఆయన్ను 'గోల్డ్​మ్యాన్'​ అని కూడా పిలిచేవారు. అయితే ఆయన శరీరంపై ఎందుకింత బంగారం ఉంటుందో తెలుసా? ఆయనకు గోల్డ్ అంటే ఎందుకింత ఇష్టమో తెలుసా? వాటికి సమాధానాల్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తెలిపారు.

బప్పి లహిరి

"ఓ హాలీవుడ్​ పాప్​ సింగర్​ను చూసి నాకు బంగారం మీద ఆసక్తి కలిగింది. గోల్డ్​ నాకు అదృష్టం లాంటిది. ఓ సాంగ్​ రికార్డింగ్​ సమయంలో మా అమ్మ నాకు దేవుడు బొమ్మ ఉన్న బంగారం చైన్​ను ఇచ్చింది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా భార్య బంగారం ఉంటే అదృష్టమని చెప్పింది. నా పెళ్లయ్యాక కెరీర్​ ఎదుగుతున్న కొద్దీ నా దగ్గర ఉన్న గోల్డ్​ అంతా రెట్టింపవుతూ వచ్చింది. నా మెడలో ఉన్న బంగారపు గణపతి చైన్​ నన్ను ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతుంది. అందుకే నేనెప్పుడు బంగారం ధరిస్తాను"

-బప్పి లహిరి, మ్యూజిక్​ డైరెక్టర్​.

గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బప్పి లహిరి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 16, 2022, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details