తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అజ్ఞాతంలోకి నటి రియా చక్రవర్తి.. కారణం ఏంటి? - రియా చక్రవర్తి లేటెస్ట్​ న్యూస్​

సుశాంత్​ తండ్రి ఫిర్యాదు మేరకు నటి రియాను విచారించేందుకు పట్నా పోలీసులు ముంబయి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిందని కొన్ని వార్తసంస్థలు తెలిపాయి. దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

What! Rhea Chakraborty is missing from her Mumbai residence?
అజ్ఞాతంలోకి రియా చక్రవర్తి.. కారణమదేనా!

By

Published : Jul 29, 2020, 8:36 PM IST

Updated : Jul 29, 2020, 9:37 PM IST

సుశాంత్​ సింగ్​​ ప్రేయసి రియా చక్రవర్తి కనిపించట్లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కొన్ని వార్తాసంస్థలు చెబుతున్నాయి. సుశాంత్​ ఆత్మహత్య విషయంలో ఈమె కుటుంబానికి సంబంధం ఉందని అతడి తండ్రి ఇటీవలే పోలీసులను ఆశ్రయించాడు. రియా కుటుంబంతో పాటు మరో ఆరుగురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పట్నాలోని రాజీవ్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అప్పటినుంచి ఈమె ఆచూకీ తెలియట్లేదట.

అజ్ఞాతంలో నటి రియా

సుశాంత్​ తండ్రి కేకే​ సింగ్​ ఫిర్యాదుతో పట్నా నుంచి నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబయికి మంగళవారం చేరుకుంది. నటి రియా కోసం ఆమె ఇంటికి వెళ్లగా, అక్కడ లేదని తెలుస్తోంది. కేకే సింగ్ తనపై దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​కు వ్యతిరేకంగా ముందస్తు బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకుందని సమాచారం. పోలీసులకు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిందని కొన్ని వార్తాసంస్థలు అంటున్నాయి.

Last Updated : Jul 29, 2020, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details