తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా లవ్​లైఫ్​ను ఇంకా కలవలేదు: త్రిష - త్రిష న్యూస్​

లాక్​డౌన్​ కారణంగా సినీతారలు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంటున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిస్తున్నారు. నటి త్రిష తన ప్రేమ వ్యవహారంపై ఓ నెటిజన్​ అడిగిన ప్రశ్నకు స్పందించింది.

we have not met as yet Says Trisha
నా లవ్​లైఫ్​ను ఇంకా కలవలేదు: త్రిష

By

Published : May 14, 2020, 6:09 PM IST

కోలీవుడ్​ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్​ త్రిష.. తన లవ్‌లైఫ్‌ను ఇంకా కలవలేదని అంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కొంత విశ్రాంతి దొరకడం వల్ల సోషల్‌మీడియా వేదికగా త్రిష తన అభిమానులకు చేరువగా ఉంటుంది. ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఆమె పలు డ్యాన్స్‌ వీడియోలతో మెప్పిస్తూనే.. ఇన్‌స్టాలో మధుర జ్ఞాపకాలతో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.

తాజాగా త్రిష ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో కొంతసమయం ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. పలువురు నెటిజన్లకు వర్కౌట్ల విషయంలో కొన్ని సూచనలనూ చేసింది.

త్రిష ఇన్​స్టా స్టోరీ

అయితే, ఓ నెటిజన్‌.. 'త్రిష..మీ లవ్‌లైఫ్‌ను కలిశారా?' అని అడగగా.. 'ఇప్పటివరకూ మేమిద్దరం ఇంకా కలుసుకోలేదు' అని త్రిష వెల్లడించింది. అనంతరం మరో నెటిజన్‌.. 'నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉందని మీరు నమ్ముతారా?' అని ప్రశ్నించగా.. "స్వచ్ఛమైన ప్రేమ ఉందని నేను నిజంగానే నమ్ముతున్నా. ప్రేమ అనేది లేకపోతే జీవించలేం. జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రేమ అనేది కావాలి" అని త్రిష తెలిపింది. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన దృష్టిలో కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌, అమిర్ ‌ఖాన్‌ ఉత్తమ నటులని చెప్పింది.

ఇదీ చూడండి.. కమనీయం..రమణీయం.. హీరో నిఖిల్​ ప్రణయం

ABOUT THE AUTHOR

...view details