తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్ జాన్వీ కపూర్​ను హెచ్చరించిన వాచ్​మన్ - జాన్వీ కపూర్

ముద్దుగుమ్మ జాన్వీ కపూర్​ను ఓ వాచ్​మన్ హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగింది? అతడు ఎందుకు అలా చేశాడు?

హీరోయిన్ జాన్వీ కపూర్​ను హెచ్చరించిన వాచ్​మన్
హీరోయిన్ జాన్వీ కపూర్

By

Published : Feb 26, 2020, 7:51 PM IST

Updated : Mar 2, 2020, 4:13 PM IST

బాలీవుడ్​ హీరోయిన్ జాన్వీ కపూర్​ను ఓ వాచ్​మన్ హెచ్చరించాడు. ఓ అబ్బాయికి సెల్ఫీ ఇచ్చే సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

అసలేం జరిగింది?

హీరోయిన్ జాన్వీ కపూర్​ను హెచ్చరించిన వాచ్​మన్

ముంబయిలోని ఓ జిమ్​ నుంచి బయటకొస్తున్న జాన్వీను ఓ కుర్రాడు సెల్ఫీ అడిగాడు. తను ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, అక్కడికి ఓ వాచ్​మన్ వచ్చి, ఆమెను హెచ్చరించాడు. ఆ అబ్బాయి మిమ్మల్మి గాయపరిచే అవకాశముందని అన్నాడు. తాను గత 25 ఏళ్ల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటున్నానని,​ అందుకే ఈ అబ్బాయితో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఆ తర్వాత కారు ఎక్కి ఇంటికి వెళ్లిపోయింది జాన్వీ.

2018లో 'దఢక్'తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం 'ఘోస్ట్ స్టోరీస్' వెబ్​సిరీస్​, గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్', హారర్​ సినిమా 'రూహ్ అఫ్జా', కరణ్ జోహార్ 'తఖ్త్'లో నటిస్తోంది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Last Updated : Mar 2, 2020, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details