తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వారి సినిమాల్లో అవకాశం నా అదృష్టం' - ఆర్.ఆర్.ఆర్

ప్రఖ్యాత దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించే చిత్రాల్లో నటించడం తన అదృష్టమని హీరోయిన్ ఆలియా భట్ తెలిపింది.

'వారి సినిమాల్లో అవకాశం నా అదృష్టం'

By

Published : Apr 21, 2019, 2:56 PM IST

ఆలియా భట్.. బాలీవుడ్​లో విభిన్న సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న హీరోయిన్​. రాజమౌళి, భన్సాలీ సినిమాల్లో ఛాన్స్​ కొట్టేసింది. ఆ ఇద్దరు దర్శకుల చిత్రాల్లో అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. చేసే పని పట్ల ఈ ఇద్దరూ ఒకేలాంటి ఇష్టాన్ని చూపుతారని ఆలియా చెప్పింది.

"చేసే సినిమాల పట్ల ఆ ఇద్దరు దర్శకులు ఎంతో ముందుచూపు కలిగి ఉంటారు. అలాంటిది వారు తెరకెక్కించే చిత్రాల్లో అవకాశం రావడం నా అదృష్టం" -ఆలియా భట్, బాలీవుడ్​ హీరోయిన్​

భన్సాలీ తెరకెక్కించే 'ఇన్షాల్లా' సినిమాలో సల్మాన్​తో తొలిసారిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఆలియా. ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు చిత్రం వచ్చే అవకాశముంది.

ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'లోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది ఆలియా భట్. ఇప్పుడిప్పుడే తెలుగు అర్ధమవుతోందని, కొంచెం కష్టమైనా సరే త్వరగానే నేర్చుకుంటానని చెప్పిందీ భామ. టాలీవుడ్ అగ్రహీరోలైనా ఎన్టీఆర్, రాంచరణ్ ఇందులో నటిస్తున్నారు.

ఇది చదవండి: 'హాలీవుడ్​కు వెళ్లే రోజు వస్తుంది' : ఆలియా భట్

ABOUT THE AUTHOR

...view details