తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హృతిక్, టైగర్ 'వార్' తెలుగు పోస్టర్ చూశారా! - hrithik

బాలీవుడ్ చిత్రం 'వార్' తెలుగు, తమిళ పోస్టర్లు విడుదల చేసింది చిత్రబృందం. హృతిక్, టైగర్ ష్రాఫ్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. వాణి కపూర్ హీరోయిన్.

వార్

By

Published : Aug 12, 2019, 12:37 PM IST

Updated : Sep 26, 2019, 5:55 PM IST

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వార్'. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం.

వార్ తెలుగు పోస్టర్​

యాక్షన్ థ్రిల్లర్​గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాణి కపూర్ కథానాయికగా నటిస్తోంది. తొలిసారి హృతిక్, టైగర్ కలిసి పనిచేస్తున్నారు. విశాల్ - శేఖర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

యశ్ రాజ్ ఫిల్మ్మ్​ బ్యానర్​పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. సిద్దార్థ్​ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. హృతిక్​తో కలిసి ఇంతకుముందు 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు సిద్దార్థ్. వీరి కలయికలో వస్తున్న రెండో చిత్రం వార్.

ఇదీ చదవండి: బాలీవుడ్​ కథానాయకుల మధ్య 'వార్'

Last Updated : Sep 26, 2019, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details