తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ కథానాయకుల మధ్య 'వార్' - వార్ సినిమా తెలుగు టీజర్

హృతిక్ రోషన్, టైగర్ ​ష్రాఫ్ కలిసి నటించిన 'వార్' తెలుగు టీజర్ విడుదలైంది. వాణీ కపూర్ హీరోయిన్​. అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్​ హీరోల మధ్య 'వార్'

By

Published : Jul 15, 2019, 1:55 PM IST

ఒక యాక్షన్ హీరో ఉంటే ప్రేక్షకులు ఆహా అంటారు. అదే ఇద్దరైతే వారి ఆనందానికి కొదవలేదు. ఇలాంటి సినిమానే త్వరలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ కథానాయకులు హృతిక్ రోషన్, టైగర్ ​ష్రాఫ్ నటించిన చిత్రం 'వార్'. టీజర్​ సోమవారం విడుదలైంది. అద్భుత యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.

ఇందులో ఈ హీరోలిద్దరూ ప్రత్యర్థులుగా కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. వాణీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ యశ్​రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: బాటిల్​ క్యాప్ ఛాలెంజ్​తో సల్మాన్ వినూత్న సందేశం

ABOUT THE AUTHOR

...view details