తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తప్పు చేశా... క్షమాపణలు కోరుతున్నా' - bollywood

'నా ట్వీట్ కారణంగా ఎవరైనా మనస్తాపం చెందితే క్షమాపణలు' అంటూ మరో ట్వీట్ చేశాడు వివేక్ ఒబెరాయ్.

వివేక్

By

Published : May 21, 2019, 11:24 AM IST

వివాదాస్పద ట్వీట్​పై ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు బాలీవుడ్ నటుడు వివేక్​ ఒబెరాయ్. తానేం తప్పుచేయలేదని తొలుత బుకాయించినా... చివరకు క్షమాపణ చెబుతూ మరో ట్వీట్​ చేశాడు.

"ఒక్కోసారి కొన్ని విషయాలు చూడగానే మనకు వినోదాన్ని కలిగిస్తాయి. అవి కొందరికి అలా అనిపించకపోవచ్చు. గడచిన పది సంవత్సరాల్లో దాదాపు రెండు వేల మందికిపైగా పేద ఆడపిల్లల బాధ్యతను తీసుకున్నాను. అటువంటి నేను ఓ మహిళ పట్ల అగౌరవంగా మాట్లాడలేను. నా ట్వీట్​ వల్ల ఏ ఒక్క మహిళ మనస్తాపం చెందినా అది తప్పే. అందుకు క్షమాపణలు. ఆ ట్వీట్‌ను తొలగించేశాను" అంటూ మరో ట్వీట్ చేశాడు వివేక్

క్షమాపణలు కోరుతూ వివేక్ ట్వీట్

విషయమేంటంటే..
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ను కించ పరిచేలా ఉన్న ఓ మీమ్‌ను వివేక్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి సోనమ్‌ కపూర్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాలతోపాటు పలువురు వివేక్‌పై విరుచుకుపడ్డారు. ఓ నటుడు అయి ఉండి మరో నటిని కించపరిచేలా ఈ పోస్టులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి.. వివేక్​ ఒబెరాయ్​కు మహిళా కమిషన్​ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details