తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వివేక్​ ఒబెరాయ్​కు మహిళా కమిషన్​ నోటీసులు

బాలీవుడ్ నటుడు వివేక్​ ఒబెరాయ్ ఎగ్జిట్ పోల్స్​పై అభ్యంతరకర ట్వీట్ చేశాడు. ఐశ్వర్య రాయ్, సల్మాన్​ఖాన్​, అభిషేక్ బచ్చన్​లను తన ట్వీట్​లో ప్రస్తావించి దుమారానికి తెర లేపాడు. మహిళలను అవమానపరిచేలా ట్వీట్​ చేశారంటూ జాతీయ మహిళా కమిషన్​ వివేక్​కు నోటీసులు జారీ చేసింది.

వివేక్

By

Published : May 20, 2019, 7:57 PM IST

ఎన్నికలవేళ దేశమంతా ఎగ్జిట్​ పోల్స్​పై చర్చిస్తోన్న వేళ బాలీవుడ్ నటుడు వివేక్​ ఒబెరాయ్ అభ్యంతరకర ట్వీట్​ చేశాడు. ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్​లను ప్రస్తావిస్తూ వివేక్ చేసిన పోస్ట్​పై తీవ్ర దుమారం రేగింది. నెటిజన్లతో సహా పలువురు ప్రముఖులు వివేక్​కు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు.

"ఇది అనుచితమైన ట్వీట్... చాలా నిరాశ కలిగిస్తోంది" అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఒబెరాయ్​కు వ్యతిరేకంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి సోనమ్​ కపూర్​ కూడా స్పందించింది. "ఈ పోస్ట్​ చూస్తుంటే అసహ్యమేస్తోంది" అంటూ ట్వీట్​ చేసింది.

"మహిళలకు గౌరవమివ్వాలి" అని మరొకరు ట్వీట్ చేశారు.

ఈ విషయంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ వివేక్​ ఒబెరాయ్​కు నోటీసులు పంపించింది. ఆడవాళ్లను అవమానపరిచేలా ట్వీట్​ చేసినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నోటీసులో ఏముందంటే..

"మీరు చేసిన ట్వీట్ మహిళలను అవమానపరిచేలా ఉంది. బాలికను మీ ట్వీట్​లో పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఓ మహిళ వ్యక్తిగత జీవితంతో పోల్చారు. ఇది తీవ్ర నేరపూరితం. మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వండి" - నోటీసులో జాతీయ మహిళా కమిషన్​

ABOUT THE AUTHOR

...view details