హీరోయిన్ ప్రజ్ఞాజైశ్వాల్‌ను రిస్క్‌లో పెట్టడం తనను ఎంతగానో బాధపెట్టిందని నటుడు మంచు విష్ణు అన్నారు. వీళ్లిద్దరూ కలిసి జంటగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' షూట్‌కు సంబంధించిన ఓ యాక్సిడెంట్ వీడియోను తాజాగా విష్ణు షేర్ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో మంచు విష్ణుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలోనే ఆయనకు బాగా గాయాలయ్యాయి. తాజాగా ఆ ఫైట్ సీక్వెన్స్ షూట్ వీడియోను విష్ణు షేర్ చేశారు.
'ఆమెకు ఇంకా క్షమాపణ చెబుతూనే ఉంటా' - మంచు విష్ణు ప్రజ్ఞాజైస్వాల్
'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్లో నటి ప్రజ్ఞాజైశ్వాల్‌ను రిస్క్‌లో పెట్టిన సందర్భాన్ని గుర్తుచేసుకుని బాధపడ్డాడు నటుడు మంచు విష్ణు. ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు.
"ఈ ప్రమాదాన్ని నేను తరచూ గుర్తు చేసుకుంటాను. ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని షూట్‌కు ముందే దర్శకుడు, ఫైట్ మాస్టర్‌కు చెప్పాను. వాళ్లెవరూ నా మాట వినిపించుకోలేదు. నాకెంతో కోపం వచ్చింది. ఆ సమయంలో నాతోపాటు ప్రజ్ఞాని సైతం రిస్క్‌లో పెట్టినందుకు నాకెంతో బాధగా ఉంది. అదృష్టం కొద్ది తనకి ఏమీ కాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం వల్ల నా తలకు కూడా పెద్దగా గాయాలవలేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నా భార్య విరానికా గర్భవతి. నా వల్ల తను ఎంతో భయపడింది. ఈ విషయమై ఇప్పటికీ నేను తనకి క్షమాపణలు చెబుతూనే ఉన్నాను. ఈ ప్రమాదం వల్ల నాకు బంధాలు, అనుబంధాల గురించి ఎంతోగానో తెలిసివచ్చింది" అని విష్ణు పేర్కొన్నారు.