గూఢచారి పాత్రలో విశాల్ నటించిన సినిమా 'డిటెక్టివ్'. 2018లో తెలుగులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. సస్పెన్స్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. నటుడు ప్రసన్న సహాయ పాత్రలో కనిపించాడు. హీరోయిన్గా అను ఇమ్మాన్యుయేల్ నటించింది.
తాజాగా దీనికి కొనసాగింపుగా మరో సినిమా తెరకెక్కనుంది. మొదటి భాగాన్ని తీసిన మిస్కిన్ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది.