కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. తదుపరి సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది. విశాల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'నాట్ ఏ కామన్ మ్యాన్'. శరవణన్ దర్శకత్వంలో విశాల్ 31వ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూట్ జరుగుతోంది. ఇందులో విశాల్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా సాగుతోన్న క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు విశాల్.
ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. దీంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.