తమిళ హీరో విశాల్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న మహిళా అకౌంటెంట్ భారీస్థాయిలో మోసానికి పాల్పడింది. ఆరేళ్లలో ఏకంగా రూ.45 లక్షల్ని తన సొంత ఖాతాలోకి మళ్లించింది. దీనిపై కంపెనీ మేనేజర్ కేసు పెట్టగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది జరిగింది?

విశాల్.. నటుడిగానే కాకుండా నిర్మాతగా, నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో 'పందెం కోడి 2', 'అభిమన్యుడు', 'డిటెక్టివ్'తో పాటు పలు సినిమాల్ని నిర్మించారు. ఈ క్రమంలోనే తన సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా అకౌంటెంట్.. ఇన్‌కమ్‌ట్యాక్స్ కట్టాల్సిన డబ్బుల్ని, తన బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకుంది. ఈ మొత్తం రూ.45 లక్షలుగా తేలింది. గత ఆరేళ్లుగా ఈ తంతు జరుగుతూ ఉన్న ఎవరూ గుర్తించలేదు. ఇటీవలే అనుమానం వచ్చి పరిశీలించగా ఈ నిజం బయటపడింది. దీంతో సంస్థ మేనేజర్.. విరుగమ్బాకమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు సాగుతోంది.
విశాల్.. 'డిటెక్టివ్ 2'తో పాటు 'చక్ర' అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వచ్చిన 'చక్ర' ట్రైలర్ అలరిస్తోంది. వైర్లెస్ మాధ్యమాల వల్ల జరిగే సైబర్ క్రైమ్‌ల గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి: