తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2019, 7:10 PM IST

ETV Bharat / sitara

ఘనంగా విశాల్ నిశ్చితార్థం

కథానాయకుడు విశాల్- నటి అనీషా నిశ్చితార్థ వేడుక హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

నిశ్చితార్థ వేడుకలో నవ్వుులు చిందిస్తున్న విశాల్- అనీషా జంట

హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో క‌థానాయ‌కుడు విశాల్... న‌టి అనీషా రెడ్డిల నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఇరు కుటుంబాల స‌న్నిహితులు, బంధువులు స‌మక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

ఇరువురి కుటుంబ సభ్యులు

తెలుగువాడైన విశాల్... కోలీవుడ్​లో స్టార్ క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న న‌టించిన చిత్రాలు తెలుగులోనూ విడుదల‌వుతుంటాయి. ఇక్క‌డ ప‌లు విజ‌యాల్ని సొంతం చేసుకున్నాడు విశాల్​. టెంపర్ రీమేక్​గా తెరకెక్కుతోన్న 'అయోగ్య' సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుదల కానుంది.

'అర్జున్‌రెడ్డి', 'పెళ్లిచూపులు' చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించింది అనీషా రెడ్డి. వీరిది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. త్వ‌ర‌లోనే ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టవుతుంది.

ABOUT THE AUTHOR

...view details