ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ పేరు వింటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం 'అపరిచితుడు'. ఈ సినిమాలో అతడి వైవిధ్య నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం విక్రమ్ 'చియాన్ 58' అనే పేరు పెట్టని చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి 'అమర్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అధికారికంగా పేరును ప్రకటించడమే మిగిలి ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఈ చిత్రంలో విక్రమ్ సుమారు ఇరవై పాత్రలను పోషించనున్నాడని సమాచారం. గతంలో 'దశావతారం' చిత్రంలో కమల్ పది పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఆ రికార్డును విక్రమ్ అధిగమించనున్నాడన్న మాట. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తోన్న చియాన్ 58 చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.