తెలంగాణ

telangana

ETV Bharat / sitara

25 గెటప్పుల షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..! - VIKRAM 58 MOVIE STARTS OCTOBER 4

హీరో విక్రమ్ కొత్త సినిమా షూటింగ్ ఈనెల 4న ప్రారంభం కానుంది. ఇందులో 25 విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నాడీ కథానాయకుడు.

హీరో విక్రమ్

By

Published : Oct 2, 2019, 12:24 PM IST

Updated : Oct 2, 2019, 9:00 PM IST

విలక్షణ శైలి, విభిన్న సినిమాలతో గుర్తింపు పొందిన నటుడు విక్రమ్. ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు. అయితే తన కొత్త సినిమా కోసం మరో సాహసం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 25 గెటప్పుల్లో నటిస్తున్నాడు. ఈనెల 4 నుంచి షూటింగ్ మొదలుకానుంది.

హీరో విక్రమ్ 58వ సినిమా పోస్టర్

విక్రమ్58 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అజయ్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ప్రేక్షకుల మందుకు రానుంది.

ఇది చదవండి: రివ్యూ: మెగాస్టార్ అయ్యారు 'సైరా'

Last Updated : Oct 2, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details