మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు..' చాలా ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దీపావళి కానుకగా ఆమె పోస్టర్ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం.
ఇందులో భారతిగా విజయశాంతి నటిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్లో తెలిపాడు. చిరునవ్వుతో చీరకట్టులో ఆకట్టుకుంటోంది రాములమ్మ.
"లేడీ అమితాబ్ విజయశాంతి గారిని భారతిగా మీకు పరిచయం చేస్తున్నాం. సంక్రాంతి కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. అందరికి దీపావళి శుభాకాంక్షలు" -అనిల్ రావిపూడి, దర్శకుడు