తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాట్​ టాపిక్​గా మారిన స్టార్​ జోడీలు! - విజయ్ దేవరకొండ రష్మిక

కోలీవుడ్​ స్టార్ కపుల్​ నయనతార-విఘ్నేశ్​ శివన్​కు నిశ్చితార్థం జరిగిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. విఘ్నేశ్​ శివన్​ పోస్ట్​ చేసిన ఓ ఫోటోనే అందుకు కారణం. మరోవైపు రీల్​ కపుల్​ విజయ్​-రష్మిక కలిసి ముంబయిలో డిన్నర్​కు వెళ్లిన ఫొటోలు వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందా? అనే చర్చ నడుస్తోంది.

Vijay-Rashmika and Nayanatara-Vignesh couple photos viral in social media
హాట్​ టాపిక్​గా మారిన స్టార్​ జోడీలు!

By

Published : Mar 25, 2021, 2:13 PM IST

కోలీవుడ్‌ రియల్‌ కపుల్‌ నయనతార ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌, టాలీవుడ్‌ రీల్‌ కపుల్‌ విజయ్‌ దేవరకొండ-రష్మిక.. వీళ్ల గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు నయన్‌-విఘ్నేశ్‌ ఓ లవ్లీ పిక్‌తో ఆశ్చర్యపర్చగా.. మరోవైపు విజయ్‌-రష్మికల పార్టీ ఫొటోలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ఈ జంటల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఎంగేజ్‌మెంటా?కాదా?

విఘ్నేశ్​ శివన్​ షేర్​ చేసిన ఫొటో

నయన్‌, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్నారనేది ఓ బహిరంగ రహస్యం. ఒకానొక సమయంలో ప్రేమలో విఫలమైన నయన్‌కు 'నేను రౌడీ నే' సమయంలో విఘ్నేశ్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. నయన్‌పై తనకున్న ప్రేమను విఘ్నేశ్‌ పలు సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తెలియజేశాడు. ఇప్పుడు ఆయన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. అందులో నయన్‌ చేతికి ఉన్న ఉంగరం చూసి.. ఈ జంటకు నిశ్చితార్థమైందని అందరూ భావించారు. కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్లూ పెడుతున్నారు. అయితే, నయన్‌ వేలికి ఉన్న ఆ ఉంగరం.. గతేడాది విఘ్నేశ్‌ షేర్‌ చేసిన చాలా ఫొటోల్లో కనిపించింది. దీంతో ఈ జంటకు నిశ్చితార్థమైందా?లేదా? అని నెట్టింట చర్చ నడుస్తోంది.

డిన్నర్‌ పార్టీలో రీల్‌ పెయిర్‌

డిన్నర్​ నుంచి వస్తున్న రష్మిక, విజయ్​

ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో రీల్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు 'గీతగోవిందం' జంట విజయ్‌ దేవరకొండ-రష్మిక. రెండు సినిమాల కోసం స్క్రీన్‌ పంచుకున్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ పలు సందర్భాల్లో వాటిని ఈ జంట ఖండించింది. వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న వీరు చాలారోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కారు. సినిమా షూటింగ్స్‌లో భాగంగా ముంబయికి చేరుకున్న విజయ్‌, రష్మిక బుధవారం రాత్రి డిన్నర్‌ కోసం నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లారు. దీంతో ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో దర్శనమివ్వడం వల్ల వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:పార్టీలో మలైకా హాట్​ పోజులు.. డ్రెస్​ ధరెంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details