బాక్సాఫీసు దగ్గర జయాపజయాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వరుసగా ఎన్ని హిట్లు కొట్టినా సరే.. ఓ ఫ్లాపు ఎదురైతే ఆ హీరో మార్కెట్ కుదేలైపోతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ విషయంలో ఇదే జరిగింది.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకుడు. కె.ఎస్.రామారావు నిర్మాత. ఇప్పుడు ఈ చిత్రానికి ఓవర్సీస్ బయ్యర్లు కరవయ్యారు. రూ.3.5 కోట్లకు అమ్ముదామనుకుంటున్నా కొనేందుకు ముందుకు రావడం లేదు. అందుకు 'డియర్ కామ్రేడ్' ఫలితమే ప్రధాన కారణం.
డియర్ కామ్రేడ్ సినిమా పోస్టర్ విజయ్.. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' ఓవర్సీస్‌లో దుమ్ము దులిపాయి. గత చిత్రం 'డియర్ కామ్రేడ్'ను దాదాపు 4.5 కోట్లకు ఆ చిత్రాన్ని కొనుగోలు చేశారు. అయితే వారికి కనీసం కోటి రూపాయలైనా రాలేదు. ఆ ప్రభావమే 'వరల్డ్ ఫేమస్ లవర్'పై పడింది.
ఈ సినిమానే కాదు ఈమధ్య తెలుగులో విడుదలవుతోన్న ఏ చిత్రానికీ ఓవర్సీస్‌లో మంచి రేటు పలకడం లేదు. సంక్రాంతి సీజన్ వరకూ ఓవర్సీస్ బయ్యర్లు.. భారీ రేట్లకు సినిమాలు కొనే స్థితిలో లేరని.. అందుకే మార్కెట్ ఇంత నెమ్మదిగా ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇది చదవండి: ట్విట్టర్ వేదికగా 'డియర్ కామ్రేడ్'పై వర్మ సెటైర్