తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​ దేవరకొండ కోసం గూగుల్​లో తెగ వెతికారు - వరల్డ్​ ఫేమస్​ లవర్​లో విజయ్ దేవరకొండ-ఐశ్వర్య రాజేశ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది గూగుల్​లో అత్యధికులు వెతికిన దక్షిణాది నటుడిగా నిలిచాడు. ఇతడు ప్రస్తుతం.. దర్శకుడు పూరీ జగన్నాథ్​తో 'ఫైటర్'​ సినిమా చేస్తున్నాడు.

విజయ్​ దేవరకొండ కోసం గూగుల్​లో తెగ వెతికారు
విజయ్ దేవరకొండ

By

Published : Dec 13, 2019, 10:14 AM IST

Updated : Dec 13, 2019, 1:57 PM IST

టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ.. చాలా తక్కువ సినిమాలే చేసినా, యువతలో విపరీతమైన క్రేజ్​ తెచ్చుకున్నాడు. హిట్​, ఫ్లాఫ్​లతో సంబంధం లేకుండా ఆదరణ దక్కించుకున్నాడు. అయితే 2019కిగానూ గూగుల్​లో అత్యధికులు వెతికిన దక్షిణాది నటుడిగా నిలిచాడు. స్టార్ హీరోలు మహేశ్​బాబు, ఎన్టీఆర్, రామ్​చరణ్, ప్రభాస్ వంటి వారిని వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు.

తన కెరీర్​లో 'పెళ్లి చూపులు', 'అర్జున్​రెడ్డి', 'గీత గోవిందం', 'ట్యాక్సీవాలా' చిత్రాలతో విజయాల్ని అందుకున్నాడు. ఈ ఏడాది 'డియర్​ కామ్రేడ్'​తోమాత్రం నిరాశపరిచాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో 'ఫైటర్'​ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతోనే బాలీవుడ్​లోనూ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. ఇదే కాకుండా 'వరల్డ్​ ఫేమస్​ లవర్'​లోనూ నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా నటిస్తున్న ఐశ్వర్య రాజేశ్​ లుక్​ గురువారం విడుదలైంది. ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.

ఇది చదవండి: 'వరల్డ్​ ఫేమస్​ లవర్​' కోసం నాలుగు రోజులు.. నలుగురు లవర్స్

Last Updated : Dec 13, 2019, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details