తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హోటల్‌కు వెళ్లను.. సెట్‌లోనే ఉంటా' - vijay devarakonda liger

'లైగర్'​ సినిమా కోసం ఎలాంటి బ్రేక్​ తీసుకోకుండా(రాత్రి, పగలు తేడా లేకుండా) షూట్​లో పాల్గొనాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు హీరో విజయ్​ దేవరకొండ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మాస్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది.

vijay
విజయ్​

By

Published : Feb 25, 2021, 8:03 AM IST

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్‌'. పాన్‌ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల ఈ సినిమా షూట్‌ ముంబయిలో తిరిగి ప్రారంభమయింది. విజయ్‌తోపాటు అనన్యా పాండే, రమ్యకృష్ణ షూట్‌లో పాల్గొంటున్నారు. 'లైగర్‌' షూట్‌ గురించి తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందించారు.

"లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడం వల్ల కొన్నినెలలు ఇంటికే పరిమితమయ్యాను. అందుకే ఎలాంటి బ్రేక్‌ తీసుకోకుండా షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని పూరీకి కూడా చెప్పాను. కావాలంటే రాత్రి, పగలు అనే తేడా లేకుండా వరుసగా చిత్రీకరణలో పాల్గొనడానికైనా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే.. హోటల్‌కు కూడా వెళ్లకుండా 'లైగర్‌' సెట్‌లోనే నిద్రపోతానని దర్శక, నిర్మాతలతో చెప్పాను" అని విజయ్‌ దేవరకొండ వివరించారు.

బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కోసం విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల విడుదలైన 'లైగర్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మాస్‌ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న 'లైగర్‌' సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: హిందీలో డబ్బింగ్​ చెప్పనున్న విజయ్​ దేవరకొండ!

ABOUT THE AUTHOR

...view details