తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​ దేవరకొండ 'ప్రియనేస్తాలు' ఎవరో తెలుసా...? - vijay devarakonda news 2020

టాలీవుడ్​ హీరో విజయ్​ దేవరకొండ తన ప్రియనేస్తాలంతో సరదాగా ఆడుకుంటూ కనిపించారు. ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే మోస్ట్​ డిజైరబుల్​ మెన్​ జాబితాలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు ఈ రౌడీహీరో.

vijay devarakonda latest news
విజయ్​ దేవరకొండ 'ప్రియనేస్తాలు' ఎవరో తెలుసా...?

By

Published : Aug 25, 2020, 3:00 PM IST

యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ‌. సినిమాలతోనే కాకుండా తన మాటతీరుతో, ట్రెండీ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

విజయ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో తన ఇంట్లో పెంచుకుంటున్న శునకాలతో సరదాగా గడుపుతుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇప్పటికే పలు సందర్భాల్లో అభిమానులతో పంచుకున్నారు. తాజాగా విజయ్‌ తన పెంపుడు శునకాలతో చిల్‌ అవుతున్న ఫొటోను మరోసారి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఫొటోలను చూసిన నెటిజన్లు 'వా..వ్‌','సో క్యూట్‌' అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

విజయ్‌.. ఇండియాలోనే టాప్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ జాబితాలో ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో షాహిద్ కపూర్, రెండో స్థానంలో రణ్‌వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నారు.

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విజయ్‌.. మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'ఫైటర్‌'(వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details