తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లిప్​లాక్​ పెడితే ఏదైనా కల్పించేస్తారా..?' - geetha govindham

టాలీవుడ్​ సెన్సేషనల్​ స్టార్​ విజయ్ దేవరకొండ త్వరలో డియర్​ కామ్రేడ్​గా రాబోతున్నాడు. బ్లాక్​బస్టర్​ హిట్​ గీతాగోవిందం తర్వాత రష్మిక మందణ్నతో కలిసి ఈ సినిమాలో సందడి చేయనున్నాడు రౌడీ హీరో. అయితే రెండు సినిమాల్లోనూ అదర చుంబనాలతో అలరించిన ఈ జోడీ ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విజయ్​.

'లిప్​లాక్​ పెడితే ఏదైనా కల్పించేస్తారా..?'

By

Published : Jul 20, 2019, 5:21 AM IST

టాలీవుడ్​ హీరో​ విజయ్​ దేవరకొండ, దక్షిణాది నటి రష్మిక మందణ్న మధ్య ప్రేమ పుంతలు తొక్కుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే సినిమాల్లో అదర చుంబనాలకు సై అంటున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఓ ఇంటర్వ్యూ వేదికగా సమాధానమిచ్చాడీ రౌడీ హీరో.

సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు

" లిప్‌లాక్‌ సీన్స్‌ మా వ్యక్తిగత జీవితాలను బలి చేస్తున్నాయి. ‘సినిమాలోని పాత్రలను పండించడానికే ముద్దు సన్నివేశాల్లో నటిస్తాం. అంతేకానీ మా వ్యక్తిగత విషయాలకు ఆ సీన్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. కొందరు మాత్రం ఆ అదర చుంబనాల సీన్లను మాకు వ్యక్తిగతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సీన్లలో నటిస్తే చాలు ఎఫైర్​లు సృష్టిస్తున్నారు. సినిమాలోని అన్ని విభాగాల వాళ్లం.. సినిమా బాగా రావాలనే కష్టపడతాం. కొన్నిసార్లు పాత్రలు పండించడానికి ఇష్టం లేకున్నా ముద్దు సీన్స్‌లో నటించాల్సి వస్తుంది. వాటి ఆధారంగా మా వ్యక్తిగత జీవితాలపై మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దయ చేసి సినిమాను సినిమాలాగే చూడండి ".
-- విజయ దేవరకొండ, టాలీవుడ్​ హీరో

విజయ్​, రష్మిక కాంబినేషన్​లో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుందీ సినిమా.

ఇవీ చూడండి...విజయ్ స్టార్ అవుతాడని నాన్నే నమ్మలేదు..!

ABOUT THE AUTHOR

...view details