తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'విజయ్ దేవరకొండ వల్లే ఈ సినిమా తీయగలిగా' - jersy

'జోడి' చిత్రాన్ని తెరకెక్కించడం.. హీరో విజయ్ దేవరకొండ వల్లే సాధ్యమైందని చెప్పాడు దర్శకుడు విశ్వనాథ్. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాల్ని పంచుకున్నాడు.

జోడి సినిమా

By

Published : Aug 16, 2019, 12:48 PM IST

Updated : Sep 27, 2019, 4:35 AM IST

'విజయ్ దేవరకొండ వల్లే ఈ సినిమా తీయగలిగా'నని చెప్పిన దర్శకుడు విశ్వనాథ్

టాలీవుడ్​ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వల్లే 'జోడి' చిత్రాన్ని తీయగలిగానని దర్శకుడు విశ్వనాథ్ చెప్పాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' కంటే ముందే ఈ కథతో తామిద్దరం ఫిల్మ్ నగర్లో నిర్మాతల చుట్టూ తిరిగినట్లు పేర్కొన్న విశ్వ.. విజయ్ సూచనలతో ఈ సినిమా రూపొందించినట్లు వివరించాడు.

ఆది సాయికుమార్, శ్రద్ధాశ్రీనాథ్ జంటగా నటించిన 'జోడి'... సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో చిత్ర విశేషాలను పంచుకుంది సినిమా యూనిట్. ప్రేక్షకులకు నచ్చే విధంగా 'జోడి' ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది.

జోడి సినిమాలో స్టిల్

ఇది చదవండి: టీజర్​లో మెగాస్టార్​.. వాయిస్​తో పవర్​స్టార్​

Last Updated : Sep 27, 2019, 4:35 AM IST

ABOUT THE AUTHOR

...view details