తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తన స్టైలిష్ లుక్, విభిన్న నటనతో ఎందరో అభిమానుల్ని సంపాందించుకున్నాడు. సినిమాల్లోనే కాక సామాజిక మాధ్యమాల్లోనూ ఈ రౌడీ హీరో జోరు కొనసాగుతోంది. తాజాగా ఈ హీరో ఇన్స్టాగ్రామ్ ఖాతా 8 మిలియన్ ఫాలోవర్లకు చేరింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన దక్షిణాది హీరోగా విజయ్ దూసుకెళ్తుండటం గమనార్హం.
విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదుగా! - విజయ్ దేవరకొండ ఇన్‌స్టా
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ హీరో జోరు కొనసాగుతోంది. తాజాగా ఇన్‌స్టాలో ఇతడి ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లకు చేరుకుంది.
విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదుగా!
అల్లు అర్జున్ (7.6మిలియన్), మహేశ్ బాబు (5.2మిలియన్), ప్రభాస్ (4.8మిలియన్), రానా దగ్గుబాటి (4మిలియన్) తర్వాత స్థానాల్లో ఉన్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో ఇతడు ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.