రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇతడ్ని హిందీ చిత్రసీమకు పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఇదేనంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది.
'ఫైటర్'తో రౌడీహీరో బాలీవుడ్ ఎంట్రీ! - vijay devarakonda movies
పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రానున్న సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే చిత్రమిదే అవుతుంది.
విజయ్.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 'ఫైటర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దీనిని పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో చిత్రబృందం ఉంది. అందుకు తగ్గట్లుగానే నిర్మాతల్లో ఒకరైన ఛార్మి.. కరణ్ జోహార్‌తో చర్చలు జరిపిందట. ఈ విషయంపై సుముఖత వ్యక్తం చేసిన కరణ్.. అందుకు ఒప్పుకున్నాడట. అంటే తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుందీ సినిమా. వీటన్నింటిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
ఇది చదవండి: రౌడీ హీరోపై మనసు పారేసుకున్న ఆలియా