సహ నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమై.. క్రేజీ హీరోగా ఎదిగి.. బిజినెస్‌మెన్‌గా మారాడువిజయ్ దేవరకొండ. యువతలో ఈ కథానాయకుడికి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా 'డియర్ కామ్రేడ్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చిన ఈ స్టార్ మరో నిర్ణయంతో అందరికీ షాకిచ్చాడు. నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించాడు.
కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 'కింగ్ ఆఫ్ ది హిల్' పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభిస్తున్నట్లు విజయ్ తెలిపాడు. తొలి సినిమా టైటిల్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. 'మీకు మాత్రమే చెప్తా' అనే పేరుతో 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది.