తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జిమ్​లో జాలీగా విజయ్​-రష్మిక... ఫొటోలు వైరల్ - విజయ్​ దేవరకొండ వార్తలు లేటెస్ట్​

వెండి తెరపై క్యూట్​ కపుల్​గా గుర్తింపుతెచ్చుకున్న విజయ్​ దేవరకొండ, రష్మిక జిమ్​లో కలిసి వర్కౌట్​ చేస్తూ దిగిన సెల్ఫీలు ప్రస్తుతం వైరల్​ అయ్యాయి. జిమ్​ ట్రెయినర్​ తన ఇన్​స్టాలో షేర్​ చేసిన ఈ ఫొటోలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

vijay and rashmika news
విజయ్​-రష్మిక కలిసి వర్కౌట్​.. ఫొటోలు వైరల్

By

Published : Aug 22, 2021, 1:10 PM IST

Updated : Aug 22, 2021, 1:28 PM IST

'గీత గోవిందం', 'డియర్​ కామ్రేడ్'​ చిత్రాలతో హిట్​ కాంబో అనిపించుకుంది విజయ్​ దేవరకొండ, రష్మిక జంట. సినిమాల్లో వీరి కెమిస్ట్రీ ఎంతలా పండిందంటే నిజజీవితంలో వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేసేంత. ఈ జంట కనిపించిన ప్రతిసారి అభిమానుల వారి గురించి తెగ చర్చిస్తారు. అయితే డియర్​ కామ్రేడ్​ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. వీరు కలిసిన సందర్భాలు కూడా చాలా అరుదు.

వెండి తెరపై క్యూట్​ కపుల్​ అనిపించుకున్న ఈ జంట మరో సినిమా ఎప్పుడు చేస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడం మాట ఏమో కానీ.. ఇద్దరు కలిసిన ఫొటోలు మాత్రం ప్రస్తుతం వైరల్​ అయ్యాయి. జిమ్​లో వర్కౌట్స్​ చేస్తూ విజయ్​ దేవరకొండతో రష్మిక దిగిన సెల్ఫీని ఆ జిమ్​ ట్రైయినర్​ తన​ ఇన్​స్టాలో షేర్​ చేశాడు. ఫిట్​నెస్​పైన వారికి ఉన్న నిబద్ధత చూస్తే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

విజయ్​తో రష్మిక సెల్ఫీ
విజయ్​తో రష్మిక సెల్ఫీ

విజయ్​, రష్మికల ఫొటో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం విజయ్​.. పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్'​ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు రష్మిక.. 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'పుష్ప' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చదవండి :మెగాస్టార్ కొత్త సినిమా 'బోళా శంకర్'

Last Updated : Aug 22, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details