విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్ నటించనుందా? అవుననే వినిపిస్తోంది సినీ వర్గాల్లో. విజయ్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలోనే నాయికగా కృతిని ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం.
విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్? - vijay devarakonda news
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో మరో బాలీవుడ్ భామ పనిచేసేందుకు సిద్ధమవుతోందట. త్వరలో ఈ విషయమై ప్రకటన వచ్చే అవకాశముంది.
విజయ్‌కు జోడీగా ఇప్పటివరకు నటించని భామ అయితేనే సినిమాకు కొత్తదనం వస్తుందని భావించి ఆమెతో చర్చలు జరిపారట దర్శక-నిర్మాతలు. మరోవైపు గతంలో సుకుమార్ దర్శకత్వంలో ‘1 నేనొక్కడినే’ చిత్రంలో నటించింది కృతి. ఆమె నటనకు ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మరో అవకాశం ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆది పురుష్’ చిత్రంలో నటిస్తోంది కృతి. ఇందులో సీత పాత్ర పోషిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్.. ఈ చిత్రం పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి.