Gopichand Pakka commercial movie release date: వాయిదా పడుతూ వస్తున్న గోపీచంద్ 'పక్కా కమర్షియల్' ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. జులై 1న థియేటర్లలోకి రానుందని పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. గోపీచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. జేక్స్ బెజోయ్ సంగీతమందించగా, మారుతి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, జీఏ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. సత్యరాజ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.
Vijay Beast trailer release date: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ 'బీస్ట్' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ నిర్మించింది. అనిరూధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఏప్రిల్ 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. పాన్ ఇండియా చిత్రాలైన 'కె.జి.ఎఫ్2', 'జెర్సీ' చిత్రాలు ఏప్రిల్ 14నప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. దాంతో ఆ వారం బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ నెలకొన్నట్టైంది.