మహిళా కమెడీయన్ విద్యుల్లేఖ రామన్.. తన ప్రియుడు సంజయ్‌ను వివాహం చేసుకుంది. ఆగస్టు 26న వీరి నిశ్చితార్థం జరగ్గా, అప్పుడు సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాకిచ్చిందీ భామ. ఇప్పుడు చాలా తక్కువమంది సమక్షంలో పెళ్లి చేసుకుంది.
ఇటీవల శరారకృతిపై దృష్టిపెట్టిన విద్యుల్లేఖకు ఫిట్నెస్ నిపుణుడు సంజయ్‌తో పరిచయమైంది. ఆ తర్వాత వారి రిలేషన్ ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చింది.