తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​, 'సాహో' హీరోలతో 'వెంకీ మామ'..! - వెంకీమామ సినిమా తాజా వార్తలు

యువ హీరో నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' చిత్రంలో అల్లరి చేసేందుకు సిద్ధమయ్యాడు విక్టరీ వెంకటేశ్​. తాజాగా మరిన్ని మల్టీస్టారర్​ చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు వెంకీ. ముఖ్యంగా రామ్ చరణ్​, ప్రభాస్​, ఎన్టీఆర్​లతో కలిసి పనిచేయాలని ఉందన్నాడు.

victory venkatesh combination movie with prabhas, ram charan and ntr
'ఆర్​ఆర్​ఆర్'​, 'సాహో' హీరోలతో 'వెంకీమామ'..!

By

Published : Dec 11, 2019, 1:56 PM IST

తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్​ చిత్రాలకు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్​ కేరాఫ్​గా నిలుస్తున్నాడు. మహేశ్​ బాబుతో కలిసి చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నుంచి ఇప్పుడు రాబోతున్న 'వెంకీ మామ' వరకు గమనిస్తే ఈ మధ్య కాలంలో వెంకీ చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం మల్టీస్టారర్‌లే ఉన్నాయి. పవన్​ కల్యాణ్​, రామ్​, వరుణ్​తేజ్​, నాగచైతన్య వంటి నవతరం హీరోలందరితోనూ కలిసి తెరపై కనిపించి మెప్పించాడు. ఇకపైనా మరిన్ని మల్టీస్టారర్​ సినిమాల వైపు వెంకీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఖమ్మం వేదికగా జరిగిన 'వెంకీ మామ' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మల్టీస్టారర్‌లపై తన మనసులోని కోరికల్ని బయటపెట్టాడు వెంకీ.

"ఇక నుంచి మరిన్ని ఎక్కువ మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడానికి ప్రయత్నిస్తా. ఈతరంలోని ప్రతి యువ హీరోతో నటించాలనుంది. ముఖ్యంగా రామ్‌చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్‌లతో కలిసి పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా."

-విక్టరీ వెంకటేశ్, సినీ హీరో

ఈ నేపథ్యంలోనే తన దగ్గర చాలా మల్టీస్టారర్‌ కథలున్నాయని, వాటన్నింటినీ తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత సురేష్ ​బాబు తెలిపాడు. త్వరలో వెంకీ, నాని కలయికలో ఓ సినిమా రానున్నట్లు సమాచారం. రచయిత ఆకుల శివ వీరిద్దరి కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: సమంత వాళ్లని సొంత పిల్లల్లా చూసుకుంటుందట!

ABOUT THE AUTHOR

...view details