తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా కల నిజమైన వేళ: విక్కీ కౌశల్​ - bollywood hero

బాలీవుడ్​ యువనటుడు విక్కీ కౌశల్​.. తన చిన్ననాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అందులో హీరో షారుక్ ఖాన్​తో కలిసి కనిపించాడీ హీరో. ఇటీవల ఓ ప్రైవేటు వేడుకలో బాద్​షా పక్కన వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై ఆనందం వ్యక్తం చేశాడు.

నా కల నిజమైన వేళ: విక్కీ కౌశల్​

By

Published : Sep 11, 2019, 4:33 PM IST

Updated : Sep 30, 2019, 6:05 AM IST

'ఉరి' సినిమా ఫేమ్ విక్కీ కౌశల్​.. సోషల్​మీడియాలోమంగళవారం ఓ ఫొటో షేర్ చేశాడు. షారుక్​తో తను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు దిగిన ఫొటో ఓ వైపు.. ఇటీవలే తీసుకున్న ఫొటో మరోవైపు ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు నా కల నిజమైంది అంటూ వ్యాఖ్య జోడించాడు. అయితే చిన్నప్పుడు ఫొటో దిగిన హీరోతో వేదిక పంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశాడు విక్కీ కౌశల్.

విక్కీ కౌశల్​ షేర్​ చేసిన చిత్రం

రాకేశ్​ శర్మ బయోపిక్​లో తొలుత షారుక్​​ను అనుకున్నారు కాని తర్వాత విక్కీకి అవకాశం లభించింది. ప్రస్తుతం 'సర్ధార్​ ఉద్దమ్​ సింగ్'​ బయోపిక్​లో నటిస్తున్నాడు విక్కీ కౌశల్. హీరోగా కనిపించనున్న 'బూత్​-1' చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది.

ఇదీ చూడండి...

Last Updated : Sep 30, 2019, 6:05 AM IST

ABOUT THE AUTHOR

...view details