తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Vicky Katrina Reception: విక్కీ కౌశల్-కత్రినాల రిసెప్షన్ ఎప్పుడంటే..? - విక్కీ కౌశల్-కత్రినా లేటెస్ట్ న్యూస్

Vicky Katrina Reception: బాలీవుడ్ స్టార్ కపుల్​ విక్కీ కౌశల్-కత్రినాల రిసెప్షన్ వచ్చేవారం ముంబయిలో జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు సమాచారం. గురువారం రాజస్థాన్​లోని సెవెన్​సెన్స్​ ఫోర్ట్​లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.

Vicky Katrina
విక్రీ కత్రినా

By

Published : Dec 11, 2021, 5:48 AM IST

Vicky Katrina Reception: బాలీవుడ్ లవ్​బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. రాజస్థాన్​లోని సెవెన్​సెన్స్​ ఫోర్ట్​లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం గురువారం ఘనంగా జరిగింది. స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. సెలబ్రిటీస్ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. అయితే వచ్చేవారం ముంబయిలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్​కు సెలబ్రిటీస్ హాజరుకానున్నారు.

మరోవైపు.. నాలుగు రోజుల పాటు జరిగే విక్కీ-కత్రినా పెళ్లి పూర్తి వీడియో హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ఇందుకోసం దాదాపు రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది నెటిజన్లకు అందుబాటులో రానుందని సమచారం.

ఇదీ చూడండి:Vicky-katrina wedding: విక్కీ-కత్రినా పెళ్లి.. అబ్బో ఎన్ని విశేషాలో?

ABOUT THE AUTHOR

...view details