తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2019, 6:15 PM IST

ETV Bharat / sitara

కలెక్షన్స్: బాక్సాఫీస్​ వద్ద 'వెంకీమామ' జోష్​

హీరోలు వెంకటేశ్-నాగచైతన్య నటించిన మల్టీస్టారర్ 'వెంకీమామ'.. వచ్చిన మూడు రోజుల్లో రూ.45 కోట్లు వసూలు చేసి ప్రేక్షకులను అలరిస్తోంది.

రూ.45 కోట్లు వసూలు చేసిన 'వెంకీమామ'
వెంకటేశ్-నాగచైతన్య

హీరోలు వెంకటేశ్‌- నాగచైతన్య.. నిజ జీవిత పాత్రల్లో నటించిన సినిమా 'వెంకీమామ'. అభిమానులను అలరిస్తూ వసూళ్ల సాధిస్తోందీ చిత్రం. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.45 కోట్ల వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది.

మూడు రోజుల్లో రూ.45 కోట్లు వసూలు చేసిన 'వెంకీమామ'

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్‌, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య నటించారు.

ఇందులో హీరోయిన్లుగా పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా నటించారు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించాడు. సురేశ్​ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ABOUT THE AUTHOR

...view details