తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2019, 6:17 AM IST

Updated : Oct 1, 2019, 7:03 AM IST

ETV Bharat / sitara

ఆ సినిమా కోసం రెండు క్లైమాక్స్​లు

వెంకటేశ్-నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీమామ కోసం రెండు విభిన్న క్లైమాక్స్​లు సిద్ధం చేశాడట దర్శకుడు బాబీ. ఈ సినిమాలో పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వెంకీమామ సినిమాాలో హీరోలు వెంకటేశ్​-నాగచైతన్య

ఈ ఏడాది ఆరంభంలో 'ఎఫ్‌2'తో సినీప్రియులను ఆకట్టుకున్నాడు విక్టరీ వెంకటేశ్. ప్రస్తుతం యువహీరో నాగచైతన్యతో 'వెంకీమామ' అనే మల్టీస్టారర్​లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దర్శకుడు బాబీ ఈ చిత్రం కోసం రెండు విభిన్న క్లైమాక్స్​లను రూపొందించాడట. అందులో ఒకటి విషాదం, మరోకటి సుఖాంతం.

ఇప్పటివరకు వెంకటేశ్​ సినిమాలకు విషాద ముగింపు ఉండటం అరుదు. ఒకవేళ అలా క్లైమాక్స్​ రూపొందిస్తే ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారనేది చిత్రబృందానికి ప్రశ్నగా మారింది. అలా కాకుండా మరో ఆనందమైన ముంగింపును డిజైన్​ చేశాడీ డైరెక్టర్​. ముందైతే రెండింటిని చిత్రీకరించి, ఆ తర్వాత నిర్మాత సురేశ్​బాబుతో చర్చించి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వెంకీమామ సినిమాాలో హీరోలు వెంకటేశ్​-నాగచైతన్య

ఇటీవల కాలంలో కథ, కథనాలు బాగుండి ముగింపు ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకు జెర్సీ సినిమానే ఉదాహరణ. త్వరలో రానున్న 'సైరా'లోనూ ఇటువంటి క్లైమాక్స్​ ఉండనుందని సమాచారం.

ఇది చదవండి: విడుదలకు ముందు 'వాల్మీకి' పేరు మార్పు

Last Updated : Oct 1, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details