టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'వెంకీమామ'. దసరా సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ట్రాక్టర్‌పై హీరోయిన్లు రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు వెంకీ-చైతూ కూర్చుని ఉన్న ఈ ఫొటో ఆసక్తి రేపుతోంది. పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కనుందనే విషయం తెలుస్తోంది.
పండుగ పూట ట్రాక్టర్‌పై మామ-అల్లుడు - పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్
సోమవారం విడుదలైన 'వెంకీమామ' ఫస్ట్‌లుక్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. రేపు మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రబృందం.
పండుగ పూట ట్రాక్టర్‌పై మామ-అల్లుడు
'వెంకీమామ'.. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. తమన్ సంగీతమందిస్తున్నాడు. కె.ఎస్.రవీందర్(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇది చదవండి: 'వెంకీమామ' సినిమా కోసం రెండు క్లైమాక్స్‌లు