తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో క్రేజీ రీమేక్​లో హీరో వెంకటేశ్​

బాలీవుడ్​ సినిమా 'దే దే ప్యార్ దే'ను తెలుగులో వెంకటేశ్ హీరోగా​ రీమేక్ చేయనున్నారు. నిర్మాత సురేశ్​బాబు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

By

Published : Jun 5, 2019, 8:27 PM IST

మరో క్రేజీ రీమేక్​లో హీరో వెంకటేశ్​

ఇటీవలే ‘ఎఫ్‌ 2’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోని ఫుల్‌ జోష్‌లోకి వచ్చాడు హీరో వెంకటేశ్. ఈ జోరులోనే నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ను షురూ చేశాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్​ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ రీమేక్‌ను పట్టాలెక్కించనున్నాడీ కథానాయకుడు.

దే దే ప్యార్ దే సినిమా పోస్టర్

ఈ మధ్యే బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించిన ‘దే దే ప్యార్‌ దే’ను త్వరలో రీమేక్​ చేయనున్నాడు వెంకటేశ్. నిర్మాత సురేశ్​బాబు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అజయ్‌ దేవగణ్, రకుల్‌ ప్రీత్‌, టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. యాభై ఏళ్ల వయసులో.. పాతికేళ్ల కొడుకు వుండీ, భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తి తన కుమారుడి వయసున్న అమ్మాయితో ప్రేమలో పడి ఎటువంటి చిక్కుల్ని ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథ.

ఇది చదవండి: అందం.. అభినయం.. బేబీ సొంతం

ABOUT THE AUTHOR

...view details