శేఖర్ కమ్ముల చిత్రాల్లో ప్రేమతో పాటు ఆప్యాయతలు, అనుబంధాలు ఒకదానికొకటి పెనవేసుకొని కనిపిస్తుంటాయి. ఆయన సినిమా పేర్లను పరిశీలిస్తే కూడా చాలా సౌమ్యంగా ఉంటాయి. తాజాగా కమ్ముల.. దగ్గుబాటి హీరో వెంకటేశ్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ చేపట్టనుందని సమాచారం. త్వరలోనే సినిమా వివరాలను చిత్ర నిర్మాణసంస్థ ప్రకటించనుందని చెప్పుకుంటున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వెంకటేశ్! - శేఖర్ కమ్ముల వార్తలు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట విక్టరీ వెంకటేశ్. త్వరలోనే పూర్తి వివరాలను నిర్మాణ సంస్థ ప్రకటించనున్నట్లు సమాచారం.
శేఖర్ కమ్ముల ఇప్పటికే వెంకటేశ్ మేనల్లుడు అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రానుందని సమాచారం. ఇక వెంకటేశ్ ప్రస్తుతం తమిళంలో వచ్చిన 'అసురన్' తెలుగు రీమేక్ 'నారప్ప' చేస్తున్నారు. ఇందులో ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.
మొత్తంగా చూస్తే అటు అల్లుడి (నాగచైతన్య) చిత్రం పూర్తి కాగానే మామతో (వెంకటేశ్) శేఖర్ కమ్ముల కొత్త చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.