కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు తెలుగులో మరో సినిమా వాయిదా పడింది. విక్టరీ వెంకటేశ్ 'నారప్ప'.. మే 14న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా విడుదల చేయాలేకపోతున్నామని వెంకీ ట్వీట్ చేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని చెప్పారు.
వెంకటేశ్ 'నారప్ప' విడుదల వాయిదా - నారప్ప రిలీజ్ న్యూస్
కరోనా ప్రభావంతో మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆ చిత్ర హీరో వెంకటేశ్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు.
వెంకటేశ్
తమిళ హిట్ 'అసురన్'కు రీమేక్ 'నారప్ప'. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించారు.
Last Updated : Apr 29, 2021, 2:42 PM IST