తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అసురన్' రీమేక్​లో వెంకీ ఒక్క పాత్రలోనే! - కేవలం ఒక్క పాత్రనే పోషించనున్న వెంకటేష్​

తమిళ సూపర్​ హిట్​ 'అసురన్'​ రీమేక్​లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు విక్టరీ వెంకటేశ్. మాతృకలో ధనుష్ రెండు పాత్రల్లో సందడి చేయగా, ​తెలుగులో మాత్రం వెంకీ కేవలం ఒక్క పాత్రలోనే కనిపించనున్నాడట.

venkatesh do a single character in asuran remake movie
'అసురన్' ద్వీపాత్రాభినయంలో ఒక్క పాత్రలోనే వెంకీ?

By

Published : Dec 2, 2019, 5:44 PM IST

Updated : Dec 2, 2019, 7:04 PM IST

విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం 'వెంకీ మామ' షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తమిళ సూపర్​హిట్ 'అసురన్' రీమేక్​లో నటించనున్నాడు. మాతృకలో ధనుష్ పోషించిన పాత్రలో వెంకీ కనిపించనున్నాడు. సురేశ్​బాబు నిర్మాతగా వ్యవహరించనున్నారు. శ్రీకాంత్​ అడ్డాల దర్శకుడు. ప్రస్తుతం స్క్రిప్ట్​ వర్క్ జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

ఇందులో ఇద్దరు 'అసురన్'​లు కాకుండా ఒక్కరే దర్శనమివ్వబోతున్నారట. అంటే తెరపై ఒక్క పాత్రలోనే వెంకీ కనిపిస్తాడన్నమాట. ఈ చిత్ర మాతృకలో ధనుష్​ యువకుడిగా, వయసు మీద పడిన వ్యక్తిగా అలరించాడు. తెలుగు వెర్షన్​లో మాత్రం వెంకీ ఒక పాత్రనే పోషించనున్నట్లు తెలుస్తోంది. వయసు మళ్లిన వ్యక్తి పాత్రను వెంకటేశ్... యువకుడి పాత్రను ఓ యువహీరోతో చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

మరి ఈ వార్తలో వాస్తవమెంతన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే 'ఎఫ్‌ 2', 'వెంకీమామ' చిత్రాల తర్వాత వెంకటేశ్ నుంచి రాబోయే హ్యాట్రిక్‌ మల్టీస్టారర్‌ చిత్రమవుతుంది.

ఇది చదవండి: వెంకీ 75.. ఇటు త్రివిక్రమ్‌.. అటు 'అసురన్‌'!

Last Updated : Dec 2, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details