టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటిలు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బాబాయ్.. అబ్బాయ్ ద్వయం త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు సమాచారం. దీనిని తొలుత హిందీలో తెరకెక్కించి ఇతర భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను తెరకెక్కించనుందట. వచ్చే ఏడాదిలో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ మొదలుకానుందని సమాచారం.
వెంకటేశ్, రానా దగ్గుబాటి కలయికలో వెబ్ సిరీస్? - వెంకటేష్ తాజా వెబ్ సిరీస్ ఏంటి?
టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి ఓ మల్టీ స్టారర్ వెబ్ సిరీస్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్‌ను పట్టాలెక్కించనుందట నెట్‌ఫ్లిక్స్.
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి వెబ్‌సిరీస్
వెంకటేశ్ ఇటీవలే 'నారప్ప' సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. అంతేగాక రాబోయే చిత్రం 'దృశ్యం-2'ని కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. 'బాహుబలి'తో రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'భీమ్లా నాయక్'లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి: