మెగా హీరో వరుణ్ తేజ్ 'బాక్సర్' సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. త్వరలోచిత్రీకరణ ప్రారంభం కానుంది. అమెరికాకు చెందిన ఒలింపిక్ పసిడి విజేత టోనీ జెఫ్రీస్ వద్ద ఇప్పటికే శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం భారతీయ బాక్సింగ్ ఛాంపియన్ నీరజ్ గోయత్ వద్ద ట్రైనింగ్ పొందుతున్నాడు.
తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకునేలా ఉన్నాడు వరుణ్. పోరాటాలే ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాకు ఫైట్ మాస్టర్‌గా హాలీవుడ్‌కు చెందిన లార్నెల్ స్టోవాల్ పనిచేస్తున్నాడు.