తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ భుజాలెక్కిన వరుణ్​​....! - pawan

మెగాహీరో వరుణ్​తేజ్​ అరుదైన ఫోటోను షేర్​ చేశాడు. చిరంజీవి, నాగబాబు, పవన్​కల్యాణ్​తో కలిసి దిగిన ఛాయాచిత్రాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇందులో పవన్​ తన భుజాలపై వరుణ్​ను ఎత్తుకున్నాడు.

వరుణ్

By

Published : May 11, 2019, 5:40 AM IST

వరుస హిట్లతో దూసుకెళ్తున్న మెగా హీరో వరుణ్​తేజ్ తన చిన్ననాటి ఫొటోను ట్విట్టర్లో షేర్​ చేశాడు. తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి, బాబాయి పవన్​కల్యాణ్​తో కలిసి దిగిన ఛాయాచిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. 'తనకెంతో ఇష్టమైన వాళ్లతో దిగిన ఫోటో' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు వరుణ్​తేజ్.​

ఈ ఫొటోలో పవన్​​ తన భుజాలపై వరుణ్​ను ఎత్తుకోగా.. చిరంజీవి, నాగబాబుపై తన రెండు చేతులేసి ఠీవిగా కూర్చున్నాడు చిన్నారి వరుణ్. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమావ్లోవృృ వైరల్​ అవుతోంది.

అంతరిక్షం, ఎఫ్​2 లాంటి వరుస విజయాలతో జోరు మీదున్నాడు వరుణ్. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండకు రీమేక్​గా తెరకెక్కుతోందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details