తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాతోనే ఉంటా అంటూ హ్యాండిచ్చారు: వరుణ్

మెగా హీరో వరుణ్​ తేజ్​కు త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి.. దానికి సంబంధించిన ఓ యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్ తీసి వరుణ్​కు పోస్ట్ చేశారు సాయి ధరమ్ తేజ్. దీనిపై వరుణ్ స్పందించారు.

వరుణ్
వరుణ్

By

Published : May 23, 2020, 8:20 PM IST

యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ వివాహం త్వరలో జరగబోతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు యూట్యూబ్‌లో వచ్చిన వీడియోను స్క్రీన్‌షాట్‌ తీసిన కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

"ఏంటి బావా(వరుణ్‌ను ఉద్దేశిస్తూ).. నీకు పెళ్లంట?" అని ఆశ్చర్యపోతున్న ఎమోజీలను షేర్‌ చేశారు. దీనికి వరుణ్‌తేజ్‌ రిప్లై ఇచ్చారు. "దానికి (వివాహానికి) చాలా సమయం ఉందిలే కానీ.. మన రానా, నితిన్‌ మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటామంటూనే సింపుల్‌గా సింగిల్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయిపోయారు" అని కామెంట్ చేశారు.

వరుణ్‌ ట్వీట్‌కు నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. "అది నిజమే.." అంటూ మద్దతు తెలిపారు. దీనిపై రానా, నితిన్‌ ఇంకా స్పందించలేదు. రానా ఈ ఏడాదిలో తన ప్రియురాలు మిహీకా బజాన్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల 'రోకా'తో వీరిద్దరి పెళ్లి సందడి మొదలైంది. డిసెంబరులోపు రానా వివాహం జరుగుతుందని ఆయన తండ్రి సురేశ్‌బాబు చెప్పారు. ఇటీవల నితిన్‌కు తన ప్రేయసి షాలినితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్‌లో దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది.

కథానాయకుడు నిఖిల్‌ లాక్‌డౌన్ సమయంలోనే ఓ ఇంటివారయ్యారు. తన ప్రేయసి పల్లవి వర్మను మనువాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తొలుత వివాహం వాయిదా వేసుకున్న నిఖిల్‌.. చివరికి తక్కువ మంది అతిథుల సమక్షంలో ప్రభుత్వ నిబంధల్ని పాటించి, పెళ్లి చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details